పదే పదే తల బొప్పి కడుతున్న ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్‌కు మాత్రం విషయం అర్థం కానట్లుంది.

పదే పదే తల బొప్పి కడుతున్న ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్‌కు మాత్రం విషయం అర్థం కానట్లుంది. ఆంధ్రప్రదేష్‌లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పదే పదే అడ్డంకులు కల్పించడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి అదనపు అడ్వాంటేజ్‌ను ఇస్తోంది కూటమి సర్కారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెనాలి పర్యటన కావచ్చు, సత్తెనపల్లి పర్యటన కావచ్చు, పొదిలి పర్యటన కావచ్చు. అక్కడ రకరకాల ఆంక్షలని ప్రభుత్వం పెడుతూ వచ్చింది. ఆ ఆంక్షల కారణంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ప్రభుత్వం నిర్బంధిస్తోంది, ప్రభుత్వం అక్కడికి పోవడానికి అలో చేయట్లేదు, అని ఎప్పుడైతే ప్రచారం జరుగుతుందో నాచురల్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో మరింత ఎక్కువ వెళ్ళాలనే కోరిక కావచ్చు, అక్కడికి వెళ్ళడానికి సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు చేస్తూ వచ్చారు. జనరల్‌గా ఉండే హ్యూమన్ టెండెన్సీ అది. సో వద్దు అని ప్రభుత్వం అడ్డంకులు కల్పించడం అనేది వైస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకొస్తుంది. ఆ అడ్వాంటేజ్ ప్రభుత్వానికి ఇబ్బందిగా కూడా మారుతోంది. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భంలో దాన్ని మరోవైపు టర్న్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా అక్కడ కాన్వాయ్‌లో వ్యక్తి మరణాన్ని ఏ స్థాయిలో అధికార పార్టీ వివాదం చేసిందో చూశాం. అక్కడ కాన్వాయిలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయి డీకొని ఓ వ్యక్తి గాయపడితే, చనిపోతే కనీసం వెనక్కి తిరిగి చూడకుండా అలా ఎలా వెళ్తారు అంటూ ఓ 10 రోజుల పాటు ఆంధ్రప్రదేష్‌ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చ చూశాం. ఆ తర్వాత అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు కావడం చూశాం. జగన్మోహన్ రెడ్డితో పాటు కార్లో ప్రయాణించిన వాళ్ళందరి పైన కేసులు నమోదు కావడం చూశాం. ఈ కేసు నమోదు అంశం హైకోర్టుకి వెళ్ళిన తర్వాత, హైకోర్టు మాట్లాడిన మాటలు చూసి ప్రభుత్వం కిక్కురు మనకుండా కూర్చుంది. హైకోర్టు అసలు ఆ ఎఫ్ఐఆర్‌నే తప్పుపట్టింది, ప్రభుత్వం, పోలీస్ అధికారులు ఈ రకమైన కేసుని ఏ రకంగా నమోదు చేస్తారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత హైకోర్టు వేసిన మొట్టికాయల కారణంగా ఈ కేసు పెట్టడం సరైందే, జగన్మోహన్ రెడ్డి కారణంగానే సింగయ్య అనే వ్యక్తి మరణించాడు కాబట్టి దానిపైన మేము న్యాయపోరాటం చేస్తాం, మేము సరిగ్గానే ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది అనే మాట నేను ఎందుకు చెప్తున్నాను, అంటే వల్లభనేని వంశీ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు వరకు వెళ్లి సిద్ధార్థ లూద్రతో వాదనలు చేయించిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డిపైన మేము పెట్టిన కేసు సరైనది అని నమ్మితే ఎందుకు ఆ అంశం పైన సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు అంటే ప్రభుత్వానికి అర్థమైంది, తాము తప్పుడు కేసు పెట్టామనే విషయం కాబట్టే సుప్రీం కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. సో సింగయ్య ఇష్యూలో కూడా ప్రభుత్వం భూమారంగ్‌ అయింది, తప్పుడు ప్రచారం చేసినట్లుగా తేటతెల్లమైంది. జగన్‌ పర్యటనలపై సీనియర్‌ జర్నలిస్ట్‌ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story