రాజకీయ పార్టీల నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలి. భాష కంట్రోల్ లో ఉండాలి.

రాజకీయ పార్టీల నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలి. భాష కంట్రోల్ లో ఉండాలి. నోరు అదుపులో లేకపోతే ప్రజలకు దూరం అవుతారు. మీ అహంకారాన్ని బయట పెట్టుకున్న వాళ్ళు అవుతారు. చాలా సందర్భాల్లో నాయకులు మాట్లాడుతున్న భాష వాళ్ళలోని ఒరిజినాలిటీని బయట పెడుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేష్‌కి సంబంధించి అటువంటి భాష మాట్లాడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేష్‌లో నాయకుల భాష అభ్యంతరకరంగా ఉంది అంటూ కూడా గతంలో మనం చాలా వీడియోస్ చేసుకున్నాం. తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన భాష పెత్తందారి తరహాలో ఉంది. ఏం మాట్లాడారు ఆయన, ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరో తెలుసా, ఒకరు కృష్ణయ్య సమీప బంధువు, ఈ కృష్ణయ్య ఎవడు, కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జెట్టి.
ఈ కృష్ణయ్య ఎవడు చెప్పమ్మా, కృష్ణయ్య ఎవడు ఏంటి చూపించండి, ఒకసారి ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ట్రస్టీ, ఇప్పుడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధం. కృష్ణయ్య సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేష్‌లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. గోపీనాథ్ జెట్టి ఐపిఎస్ అధికారిగా ఉన్నారు, సిట్లో మెంబర్ గా ఉన్నారు, కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతిమణి నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ లో యక్టివ్ మెంబర్, ఆయనకు సమీప బంధువు గోపీనాథ్ జెట్టి, ఆయన సిట్లో ఉన్నారు. కాబట్టి వైసీపీ నాయకులను వేధించడం కోసం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు దగ్గరగా ఉన్న వాళ్ళు, ఈ సిట్లో ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్న అంశం. ఈ అంశాన్ని గౌరవంగా చెప్పొచ్చు, ఇదిగో చంద్రబాబు నాయుడుకి దగ్గర వ్యక్తులు సిట్లో ఉన్నారు కాబట్టి, వైసీపీని వేధించడం కోసం తనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల బంధువుల్ని తనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని సిట్లో వేసుకున్నారు అని ఆరోపణ చేయొచ్చు. తప్పేం లేదు, దానికి సంబంధించి మీకున్న ఫోటోగ్రాఫ్స్ ఉంటే చూపించొచ్చు. దానికి తప్పేమీ లేదు, కానీ మాట్లాడుతున్న భాష ఏంటి, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని, 70 సంవత్సరాల వయసు పైనున్న ఓ వ్యక్తిని వాడు వీడు అంటూ సంబోధించడాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి సమర్ధించుకుంటారు. ఏ రకంగా సమర్ధించుకుంటారు, పైగా ప్రస్తుతం విధిలో ఉన్న ఒక సీనియర్ ఐపిఎస్ అధికారిని, వాడు వీడు అంటూ సంబోధించడాన్ని ఏ రకంగా సమర్ధించుకుంటారు. ఏం భాష ఇది, ఏం చెప్పదలుచుకుంటున్నారు, మీరు మీ హయాంలో ఏర్పాటైన అనేక కమిటీలలో, మీ హయాంలో అనేక కీలకమైన పదవుల్లో మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్ళు లేరా, మీరు ఏర్పాటు చేసిన సిట్లో మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్ళు లేరా, ఉండరా, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు సన్నిహితులుగా ఉన్న వాళ్ళకు అటువంటి బాధ్యతలు ఇచ్చి, మీ సొంత పనులను చక్కపెట్టుకునే కార్యక్రమం చేస్తుంటారు కదా. గతంలో మీరు చేసిందే, అంతకుముందు ఇంకెవరో చేసిందే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తోంది.


