ఆంధ్రప్రదేష్‌లో పరిస్థితులు, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత

ఆంధ్రప్రదేష్‌లో పరిస్థితులు, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పైన దాడులు, కేసులు వీటన్నింటిపైన ఆంధ్రప్రదేష్‌లో అధికారం కోల్పోయిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేశారు వైసీపీ (YCP)అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో అధికారం లోకి వచ్చిన వెంటనే కూటమికి సంబంధించిన నేతలు, తమ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని కొడుతూ, వీడియోలు తీసి, ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి, పొందిన రాక్షసానందాన్ని దేశం దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఢిల్లీ (Delhi)వేదికగా ఆ వీడియోస్ అన్నిటిని ప్రదర్శించి, వివిధ రాజకీయ పార్టీల నాయకులను కూడా అక్కడికి పిలిచి వాళ్ళందరికీ చూపించారు. సో ఆంధ్రప్రదేష్‌లో శాంతిభద్రతలకు ఏ రకంగా విఘాతం కలిగిస్తున్నారు ఆంధ్రప్రదేష్‌లో పొలిటికల్ మోటోతో ప్రత్యర్ది రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలపైన ఏ రకంగా దాడులు చేస్తున్నారు, అనేది దేశం దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వెళ్ళారు. దేశం దృష్టికి తీసుకొచ్చారు. నిజానికి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి (Ys Jagan)ఆ కార్యక్రమం చేసిన తర్వాత, అక్కడ ఆ వీడియోల ప్రదర్శన తర్వాత, దేశంలో జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చిన తర్వాత, జాతీయ స్థాయిలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అయి, వైసీపీకి సంఘీభావం తెలిపిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కారు కాస్త అటువంటి దాడులను తగ్గించేసింది, ఆపింది. సో ఇటీవల కాలంలో కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కేసుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వైసార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని వరసగా అరెస్టులు చేస్తూ వస్తుంది. సరే కారణాలు ఏదైనా కావచ్చు, ఏదో కేసు, ఏదో కేసుకు సంబంధించిన అంశం, ఏదో చార్జి షీట్లు, ఇంకేదో ఇంకేదో చెప్తున్నప్పటికీ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్నాయి అవన్నీ పొలిటికల్ మోటివేటెడ్ కేసులని. డజన్ల కొద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తుంది. ఇప్పటికే అనేకమంది మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యారు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అరెస్ట్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న అధికార యంత్రంగాన్ని, అధికారులుగా పనిచేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో కేసులు పెడుతూ వేధిస్తూ ఉన్న నేపథ్యంలో, కేసులు పెడుతూ తమ పార్టీ కార్యకర్తలని వేధిస్తున్నారని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో, సో ఈ అంశాన్ని ఇక్కడికే పరిమితం చేయకుండా ఢిల్లీ స్థాయి వరకు మరోసారి తీసుకెళ్దాం, ఢిల్లీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్దాం, దేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్దాం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనబడుతుంది. త్వరలో ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా సమాచారం, ఢిల్లీకి వెళ్ళడం వెనక ఉద్దేశం కేవలం ఆ పార్టీకి సంబంధించిన నాయకులని అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెట్టారు, జైలుకి పంపించారు, అక్రమ కేసులు పెట్టారు ఇటువంటివి, కాకుండా ఇటువంటి వాటితో పాటు, ఇటీవల ఆంధ్రప్రదేష్‌లో నమోదవుతున్న కేసులకు సంబంధించి, ఆంధ్రప్రదేష్‌లో జరుగుతున్న అరెస్టులకు సంబంధించి, కోర్టులు కొన్ని వ్యాఖ్యలు చేశాయి. హైకోర్టు అనేక సందర్భాల్లో ఇటీవల ఆంధ్రప్రదేష్ పోలీసుల పనితీరుని తప్పుపడుతూ వచ్చింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
