ఆంధ్రప్రదేష్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేష్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక భారీ నిడివి ఉన్న తెలుగు సినిమాని తలపిచింది 2గంటల 42 నిమిషాల ఆయన సుదీర్ఘ ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఏ రకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆ నిర్ణయాలు ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి, అనే విషయాలపైన సుదీర్ఘ వివరణ ఇస్తూ వచ్చారు. ఆయన అడపా దడప ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి సుదీర్ఘంగానే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బహుశా ఇటీవల కాలంలో అత్యంత పెద్ద ప్రెస్ మీట్ గా నిన్నటి ప్రెస్ మీట్ ని చూడొచ్చు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అనేక విషయాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు, ఒకటి పరకామణి కేసుకు సంబంధించి పరకామణి కేసులో అతను దొంగతనం చేస్తుండగా దొరికింది 79 వేల రూపాయల విలువైన డాలర్లు కొట్టేస్తూ, కానీ ఆయన 15 సంవత్సరాలుగా దొంగతనం చేస్తూ ఉన్నారు, మా ప్రభుత్వ హాయంలో ఆయన్ని అరెస్ట్ చేసి, అప్పుడు దొంగలించిన డాలర్లతో పాటు గతంలో ఆయన దొంగతనం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ రాయించుకొని, ఆయన పైన కేసు నమోదు చేస్తే మేము మా ప్రభుత్వం తప్పు చేసింది అంటూ ఇప్పుడు మా పైనే కేసులు పెట్టి విచారణ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది టాపిక్ డైవర్షన్ లో భాగంగా చేస్తున్న వ్యవహారం అంటూ చెప్తూ వచ్చారు. దాంతో పాటు కూటమి సర్కారు చేసిన మోసాలు ఇవి అంటూ మాట్లాడుతూ వచ్చారు. కొన్ని ప్రశ్నలు కూడా కూటమి సర్కార్‌కు ఆయన వేస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృత్తి గురించి మాట్లాడారు, రెండు సంవత్సరాలు అయిపోయింది, ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఈ రెండు సంవత్సరాల్లో కలిపితే 72 వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్కరికైనా ఇచ్చారా, ఆ హామీని నెరవేర్చారా, ఏ రకంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పగలుగుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
దాంతో పాటు ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళ నిండిన వాళ్ళందరికీ రూ.1500 ఇస్తాన్నారు, ఇచ్చారా, అది ఎందుకు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, 18,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డ ప్రతి సంవత్సరం నష్టపోయింది కదా, రెండు సంవత్సరాలకి ఇది కలిపితే రూ.36,000 రూపాయలు అవుతుంది కదా, దాన్ని ఎందుకు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. బీసి, ఎస్సీ. ఎస్టి. మైనారిటీలకు 50 ఏళ్ళ దాటగానే పెన్షన్లు ఇస్తామని చెప్పారు, ఆ పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు రెండు సంవత్సరాల్లో పెన్షన్ ఇవ్వలేదు కదా, ఇది కూడా మోసం చేయటమే కదా, అమ్మవడి పథకం పేరు మార్చారు, తల్లికి వందనం అన్నారు, ప్రతి పిల్లోడికి 15 వేలు, ప్రతి పిల్లవాడికి 15 వేలు ఇస్తామన్నారు కొంతమందికి 8000, 9000 కొంతమందికి 13000 ఇచ్చారు, చాలా మంది పిల్లలకు సంబంధించి ఈ తల్లికి వందనం కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు అనే విషయాన్ని చెప్తున్నారు. దీపం పథకం కింద ప్రతి ఏటా మూడు సిలిండర్లు ఇస్తాన్నారు, మూడు సిలిండర్లు ఇవ్వకపోగా ఒక ఏడాది ఒక సిలిండర్ ఇచ్చారు, తర్వాత ఏడాది రెండు సిలిండర్లు ఇచ్చారు, అవి కూడా అందరికీ అందట్లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇలా అనేక అంశాలకు సంబంధించి కూటమి సర్కారు ప్రజల్ని మోసం చేస్తూ వచ్చింది, కూటమి సర్కారు ప్రజలకు ద్రోహం చేస్తూ వచ్చింది అనే విషయాన్ని చెప్తున్నారు. కూటమి సర్కార్ వైఫల్యాలు, జగన్ సుదీర్ఘప్రెస్‌మీట్‌పై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


