YS Jagan : త్వరలో జగన్‌ అరెస్ట్..?

ఏపీలో ఓ భారీ అరెస్ట్ జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించే తరహా అరెస్ట్ ఉండబోతుందని పొలిటికల్ సర్కిల్‌లో వార్త నడుస్తోంది. ఆ అరెస్ట్ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌(Ys Jagan)దే అంటూ తెలుగుదేశం పార్టీ(TDP)కి సంబంధించిన నాయకులు ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు.

పార్లమెంట్‌లో నిన్న టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు(lavusrikrishnadevarayalu) మద్యం అంశం ప్రస్తావన తీసుకొచ్చారు. వేల కోట్ల రూపాయలు దేశాలు దాటించారని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే, తమిళనాడు లిక్కర్‌ స్కాం కంటే, దేశంలో జరిగిన ఇతర స్కాంల కంటే ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh) లిక్కర్ స్కాం చాలా పెద్దదని అన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇంటెన్షన్‌ను సూచిస్తున్నాయి. దానికి బలం చేకూర్చేలా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) కూడా మీడియాతో మాట్లాడారు. జగన్‌ అరెస్టుకు కుట్ర జరుగుతోందని ఆయన మీడియాతో అన్నారు. ఏదో రకంగా జగన్‌ను అరెస్ట్ చేయాలని టీడీపీ చూస్తోందన్నారు. వైఎస్‌ జగన్‌ను అరెస్టుకు సంబంధించి కుట్ర జరుగుతోంది, ఏదో రకంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story