ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌కి వచ్చారు.

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌కు రావడం కొత్తఏం కాదు, కానీ చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఆయన కోర్టులో విచారణకు హాజరు కాబోతున్నారు. 2020 జనవరి తర్వాత సిబిఐ విచారణకు కోర్టుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లడం ఇదే తొలిసారి. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టుకు వెళ్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను, కోర్టుకు హాజరుకావడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజలందరికీ కన్వీనియంట్ గా ఉండదు అంటూ, జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించి, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరునుంచి ఆయనకి మినహాయింపుని ఇచ్చింది. తాజాగా కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. తాను పదే పదే కోర్టుకు రావడం ద్వారా రకరకాల ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అవసరమైతే ఆన్లైన్ లో తాను విచారణకు హాజరవుతాను అనే విషయాన్ని చెప్పారు. కానీ కోర్టుకు సిబిఐ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సిందేనని, కోర్టు ముందు సిబిఐ ఆర్గ్యూ చేసిన నేపథ్యంలో, కోర్టు కూడా ఈ నెల 21లోగా సిబిఐ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డిని కోరింది.

ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒకరోజు ముందుగానే కోర్టుకు విచారణకు హాజరయ్యారు. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడ నుంచి కోర్టుకు బయలుదేరారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌కు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నారు, కోర్టుకి వెళ్ళడానికి సంబంధించి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కి వస్తారనే సమాచారంతో, చాలా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో మొహరించారు. దాదాపు ఐదు నుంచి 10వేల మంది కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌పోర్టు దగ్గర కనపడ్డారు. ఉదయం 8 గంటల నుంచి జగన్మోహన్ రెడ్డి రాక కోసం అక్కడ ఎదురుచూస్తూ కనపడ్డారు. ఎయిర్‌పోర్టు దగ్గర నుంచి కోర్టుకు వెళ్ళే మార్గం అంతా కూడా ఫ్లెక్సీలతో నింపేశారు. 2029 లో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం లాంటి ఫ్లెక్సీలు ఇక్కడ కనపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సెపరేట్ అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తెలంగాణకు సంబంధం లేనప్పటికీ, తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉనికే లేనప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలని తెలంగాణలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆపేసినప్పటికీ, తెలంగాణలో కమిటీలు ,తెలంగాణలో పార్టీనే పూర్తిగా లేకుండా చేసినప్పటికీ, తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారు అనేదానికి ఒక ఎగ్జాంపుల్ గా ఈరోజు బేగంపేట దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సందోహం, కార్యకర్తలకు సంబంధించిన హడావిడి చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్‌లో జగన్‌ మేనియాపై వైఎన్‌ఆర్‌ ఏమన్నారంటే..!

Updated On
ehatv

ehatv

Next Story