YS Jagan Pulivendula Tour : పులివెందులలో జగన్ చేయాల్సిందేంటి..?
వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్తున్నారు. పులివెందులో రెండు రోజులో, మూడు రోజులో ఆయన పర్యటనం చేయబోతున్నారు.

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్తున్నారు. పులివెందులో రెండు రోజులో, మూడు రోజులో ఆయన పర్యటనం చేయబోతున్నారు. పులివెందుల ప్రాంతానికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలపైన స్పందించబోతున్నారు. అక్కడికి వస్తున్న అనేకమందిని ఆయన కలవబోతున్నారు కానీ, జగన్మోహన్ రెడ్డి పులివెందులలో చేయాల్సింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి పులివెందులలో చేయబోతుంది ఏంటి,చాలా కాలంగా చేస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి, పులివెందుల వస్తున్నారంటే కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు, రాయలసీమకు సంబంధించిన వాళ్ళు, చాలా మంది నాయకులు అక్కడికి వస్తుంటారు, ఆయన క్షణం తీరిక లేకుండా వస్తున్న వాళ్ళందరినీ కలిసి ఫోటోలు దిగుతుంటారు. అయిపోతుంది కార్యక్రమం వచ్చేస్తారు వెనక్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘోర పరాభావం 11 సీట్లకు పరిమితం కావడం ఏముందో పులివెందల నియోజక వర్గంలో జెడ్పిటీసి ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అటువంటిదే, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజక వర్గంలో జెడ్పిటీసి ఎన్నికల్లో ఓడిపోవడం అనే మాట వేరే గానీ, జెడ్పిటీసి ఎన్నికల్లో ఏజెంట్లను కూడా పెట్టలేకపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, షేమ్ పార్ట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది జగన్ సొంత నియోజక వర్గంలో, వైఎస్ కుటుంబం కోటలో జెడ్పిటీసి ఉపఎన్నికల సందర్భంగా మీ సిట్టింగ్ జెడ్పిటీసి ని అక్కడ కోల్పోయిన సందర్భంగా జరిగిన ఎన్నికలో, ఏజెంట్లని పెట్టలేకపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చేంత అభిమానులు, ప్రాణాలు ఇచ్చేంత క్యాడర్ అక్కడ ఉంటారు, దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబంతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి నియోజక వర్గంలో మీకు ఏజెంట్లు దొరకని పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఆలోచన చేయడంపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాలి.
ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతమంది నాయకులతో ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, ఏం జరిగింది ఏంటి అని తెలుసుకున్నారు ఓకే, అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగు దేశం పార్టీ అధికార దుర్వినియోగం చేసింది, కేసులు పెడతామంది, అరెస్ట్ చేస్తామంది, కొడతామంది, పోలీసులను పెట్టింది, ఇవన్నీ ఓకే ,అవన్నీ ఉన్నప్పటికీ, మీ క్యాడర్ పారిపోతే ఎట్లా, పోలీసులను చూస్తే, అధికార పార్టీని చూస్తే, మీ క్యాడర్ పారిపోతే ఎట్లా, జనం ఓట్లు వేయలేదు అంటే వేరే విషయం, మీ క్యాడర్ పారిపోతే ఎట్లా, సొంత నియోజక వర్గంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాడర్ నమ్మకపోతే ఎట్లా, సొంత నియోజక వర్గంలోని క్యాడర్ కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే ఎట్లా, ఆ పులివెందుల జెడ్పిటీసి పరిధిలో ఎన్నిక జరిగిన ప్రాంతంలో ఏం జరిగింది, మనవాళ్ళు ఏజెంట్లు కూడా ఎందుకు కూర్చోలేకపోయారు అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలకు వేస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సకల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


