మామిడి రైతులకు సంబంధించిన వివాదం ఏంటి, మామిడి రైతుల కష్టాలకు సంబంధించి దాదాపు నెల 15 రోజులుగా చిత్తూరు జిల్లాలో ఆందోళనలు చూస్తున్నాం

మామిడి రైతులకు సంబంధించిన వివాదం ఏంటి, మామిడి రైతుల కష్టాలకు సంబంధించి దాదాపు నెల 15 రోజులుగా చిత్తూరు జిల్లాలో ఆందోళనలు చూస్తున్నాం, ఆంధ్రప్రదేష్‌ వ్యాప్తంగా కూడా మామిడి రైతుల కష్టాలకు సంబంధించిన వార్తలు చదువుతూన్నాం. నేను కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మామిడి రైతులకు సంబంధించిన ఇబ్బందులపైన వీడియోస్ చేశా. సో మామిడి రైతులు ఎక్కువగా ఉన్న చిత్తూరు లాంటి జిల్లాల్లో అక్కడ ఫ్యాక్టరీలు, ఆ మామిడి పండ్లను కొనుగోలు చేసే అంశానికి సంబంధించి వివాదం నడుస్తోంది. ధరకు సంబంధించిన వివాదం నడుస్తోంది. సో ఇన్ టైంలో వాళ్ళు కొనుగోలు చేయకపోవడం కారణంగా మామిడి పండ్లన్నీ పాడైపోయి రైతులు నష్టపోతున్నారు.

కొన్ని వందల మంది రైతులు కొన్ని వేల మంది రైతులు ఆ ప్రాంతంలో మామిడినే సాగి చేస్తూ జీవిస్తూ ఉన్నారు. అనేకమంది రైతులు మదనపల్లిలో టమాటాలను ఎలాగా అయితే ధర లేని సందర్భంలో తీసుకొచ్చి రోడ్డు మీద పోసి నిరసన తెలిపేవాళ్లు, ట్రక్కులు కొద్ది మామిడి పండ్లు తీసుకొచ్చి రోడ్డు మీద అలా వదిలేసి పారబోసి తమ నిరసనని, తమ ఆందోళనని రైతులు బయటికి చెప్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి చలనం రాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి, ఈరోజు పరామర్శకి వెళ్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాన్ని రాజకీయం చేస్తున్నారు. అక్కడికి వెళ్లి పరామర్శ చేయడానికి ఇంత పెద్ద బల ప్రదర్శన చేయడం ఎందుకు, పైగా మామిడి సీజన్ ఆల్మోస్ట్ అయిపోయి మామిడి సీజన్ చివరి దశలో ఉండి ఇంకో వారం 10 రోజుల్లో మామిడి సీజన్ అయిపోతుంది, రెండు వారాల్లో మామిడికి సంబంధించిన సీజన్ అయిపోతుంది, ఇప్పుడు వెళ్లి అక్కడ పరామర్శ చేసి ఏం సాధించదలుచుకున్నారు, సీజన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఈ ప్రశ్నలు అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నాయి.

అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న ప్రశ్నలకి వైసీపీ సమాధానం ఏంటో తెలియదు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గతంలో కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పుడు అనుమతులు, రకరకాల కారణాలతో వెళ్ళలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో గ్యాదరింగ్ చేయాల్సిన అవసరం ఎందుకుంది అనే అనే ప్రశ్నకు వైసీపీ సమాధానం చెప్పాలి. వైసీపీ జనరల్ గా రాజకీయ లబ్ది కోసం దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండొ,చ్చు రాజకీయ పార్టీలో ఏం పని చేసినా రాజకీయ లబ్ది లేకుండా ఉండాలని కోరుకోవు కాబట్టి నాచురల్ గానే అటువంటి పొలిటికల్ గెయిన్ తీసుకునే ప్రయత్నం వైస్సార్‌ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వం చెప్తోంది సీజన్ అయిపోతోంది, సీజన్ చివర్లో ఉంది ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు అని. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story