P4 మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చబోతుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు.

P4 మొత్తం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చబోతుంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేప్తున్నారు. ప్రతి ఏటా 10% పేదరికాన్ని తగ్గించడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ పోతున్నామని ఆయన చెప్తూ వచ్చారు. సమాజంలో డబ్బు ఉన్న వాళ్ళంతా కొంతమంది పేదవాళ్ళని దత్తత తీసుకొని, వాళ్ళని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, ఇదే తాను కనిపెట్టిన పి4 అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. పి4 ఒక గేమ్ చేంజర్ గా చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు. P4 ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి అట్టహాసంగా ఈ ఏడాది మార్చి 30వ తారీఖున ఒక భారీ సభని ఏర్పాటు చేసి, P4 లాంచ్ చేసామని చెప్పింది ప్రభుత్వం. P4లాంచింగ్ కార్యక్రమానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఖర్చు పెట్టింది, పెద్ద గ్యాదరింగ్ చేసింది, పెద్ద సభ నిర్వహించింది, P4ని అట్టహాసంగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదొక అత్యద్భుతమైన ఆలోచన అని చెప్పింది. డబ్బులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి దత్తత తీసుకొని వాళ్ళని ఆర్థికంగా పైకి వచ్చేలా చేయడం అనేది ఈ పథకానికి సంబంధించిన ఉద్దేశంగా కనబడుతుంది. టర్మినాలజీ ప్రభుత్వం ఏం చెప్పినా, గతంలో కూడా కంపెనీలు డబ్బులు ఉన్నవాళ్ళు సిఎస్ఆర్ పేరుతో నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పటికీ ఉంది, అది కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ సంపాదనలో నుంచి కొంత డబ్బు సొసైటీ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. మంచినీళ్ల కోసం, స్కూల్స్ కోసం, హాస్పిటల్స్ కోసం, రకరకాల రోడ్ల కోసం, రకరకాల ప్రజ ఉపయోగ కార్యక్రమాల కోసం వాళ్ళు సిఎస్ఆర్ పేరుతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది అటువంటి డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం మనుషుల మీద పెట్టండి, ఆ మనుషులు పైకి రావడానికి సంబంధించి ప్రయత్నం చేయండి. అని చంద్రబాబు నాయుడు దాన్ని మార్చారు. P4లో భాగంగా అందరూ ముందుకు రావాలి అని చెప్పారు. P4 చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెప్పారు. P4 లాంటి బ్రహ్మ పదార్థం ఏంటో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా అవగాహన ఉందని నేను అనుకోవట్లేదు, ఇప్పుడు మార్చి 30 న ఈ పథకాన్ని లాంచ్ చేస్తే P4ని ప్రజలకు చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమంగా చెప్తే, ఇప్పుడు మన నవంబర్ 20వ తారీకున ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో P4 ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఎన్నో ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా, అసలు P4 ఇంప్లిమెంట్ అవుతుందా, P4 సంగతి ఏంటి ఏమైపోయింది. P4 ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, P4తో గుర్తించని కుటుంబాలు ఎన్ని, P4 ఎంతమంది ఎన్ని కుటుంబాలని దత్త తీసుకున్నారు. P44 తో ఎంతమంది ఎన్ని కుటుంబాలని పైకి తీసుకొచ్చారు. సంవత్సరానికి 10% పేదరికాన్ని తీసేస్తాం అంటున్నారు ఇప్పుడు దాదాపు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో ఎన్ని కుటుంబాలు పేదరిక నుంచి బయటపడ్డాయి.

Updated On
ehatv

ehatv

Next Story