పులివెందుల జెడ్పిటీసి ఉప ఎన్నికకు రీపోలింగ్ జరగబోతోందా అంటే జరగడానికి అవకాశం ఉంది అనిపిస్తుంది.

పులివెందుల జెడ్పిటీసి ఉప ఎన్నికకు రీపోలింగ్ జరగబోతోందా అంటే జరగడానికి అవకాశం ఉంది అనిపిస్తుంది. రీపోలింగ్ ఎప్పుడైనా ఎందుకు జరుగుతుంది, చాలా సందర్భాల్లో ఎన్నికలు జరిగిన చోట రీపోలింగ్ కి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ 97, 98, 99 అయిన సందర్భాల్లో ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఆ స్థాయిలో పోలింగ్ అవ్వడం పైన అనుమానాలు ఉన్నా, రీపోలింగ్ కి కాల్ చేయడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు కనపడ్డా రీపోలింగ్ చేసిన సందర్భాలు చూస్తున్నాం, అలా కాకుండా ఘర్షణల కారణంగా ఓటింగ్ అసలు జరగని పరిస్థితి. సో అక్కడ పోలింగ్ జరిగిన తీరుపైన పార్టీల వైపు నుంచి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా కూడా రీపోలింగ్ జరగడం చూస్తుంటాం. సో రీపోలింగ్ కి కావలసిన అర్హతలన్నీ కూడా పులివెందుల జెడ్పిటీసి ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నాయి.

ఏం జరిగింది, ఏం జరుగుతోంది, నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా పులివెందులు ఎన్నిక జరుగుతోంది. పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికను తనకు తానుగా ఒక ప్రెస్టేజ్ గా తీసుకుంది కూటమి సర్కారు, ప్రెస్టేజ్ గా తీసుకొని గెలవకపోతే ఎలా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. గెలవకపోతే ఎలా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయి, ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కుతోంది. బయట సమాజానికి తెలియని చాలా ఘోరాలు పులివెందుల జెడ్పిటిసి ఎన్నికల సందర్భంగా చూస్తున్నాం. మొత్తం భారతదేశ చరిత్రలో దాదాపు రెండు దశాబ్దాలుగా నేను జర్నలిస్ట్ గా ఉండి చాలా ఎన్నికలని గమనించాను, చాలా ఎన్నికలు చూశాను, చాలా ఎన్నికలు జరిగిన తీరు గురించి చదివాను, కానీ ఒక ఊరుకి సంబంధించిన ఓటర్లందరినీ, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి మరొక 72 గంటల్లోనో ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో, ఓ ఊరికి సంబంధించిన ఓటర్ల అందరినీ , మీరు ఈ ఊర్లో ఓటు వేయొద్దు పక్కఊరికి వెళ్లి ఓటు వేయండి అని ఎలక్షన్ కమిషన్ చెప్పడం, అనేది నేను ఎక్కడ వినలా, చూడలా. నిజానికి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికంటే ముందే పోలింగ్ బూతులు, ఏ బూతులో ఎవరు ఓట వేయాలి, అనే అంశానికి సంబంధించిన క్లారిటీ ఉంటుంది.

ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు కానీ, ఎన్నికలు జరగడానికి రెండు మూడు రోజుల ముందు ఓ ఊరికి సంబంధించిన ఓటర్లంతా, మీరు వేరే ఊరికి వెళ్లి ఓటు వేయండి, ఆ ఊరు ఓటర్లంతా ఇక్కడికి వచ్చి ఓటు వేస్తారు అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది వింత, విచిత్రం, విడ్డూరం. అది పులివెందుల జెడ్పిటీసి ఎన్నికల సందర్భంగా జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ చేసిన వైలేషన్ గా దాన్ని చూడాలి, ఎలక్షన్ కమిషన్ పార్టీలో వ్యక్తులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల జెడ్పిటిసి ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషనే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



Updated On 13 Aug 2025 9:41 AM GMT
ehatv

ehatv

Next Story