Chief Minister Chandrababu Naidu: బాబు గారూ ఎమ్మెల్యేలను గడపగడపకూ పంపండి..!

Chief Minister Chandrababu Naidu: బాబు గారూ ఎమ్మెల్యేలను గడపగడపకూ పంపండి..!

By :  ehatv
Update: 2025-06-07 09:52 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలతో సమీక్ష చేశారు. ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏడాది మనం చేసిన కార్యక్రమాలేంటి, ఇంకా ఏం చేయాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రతీ ఎమ్మెల్యే బాగా పనిచేయాలని, క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకొని పనిచేయాలన్నారు. తమ ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్లీ మళ్లీ గెలిచేందుకు ప్రయత్నించాలని, ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిచి, అలాగే ఉండి పోకూడాదని రిపీటెడ్‌గా గెలిచేందుకు ప్రయత్నించలన్నారు. సీనియర్ నాయకుడిగా ఎమ్మెల్యేలంతా చంద్రబాబు చెప్పిన మాటలు వినాల్సిందే దాంట్లో తప్పు లేదు. కానీ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయమేంటనేది తెలుసుకోవాలి కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో తీసుకున్న విప్లవాత్మక కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో గడప గడపకూ ఎమ్మెల్యే అంటూ జగన్‌ తమ ఎమ్మెల్యేలను ప్రతీ ఇంటికి పంపించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, అర్హులకు పథకాలు అందేలా చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎమ్మెల్యేలు తిరిగేవారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు ఎందుకు రద్దు చేసుకున్నట్లు.. జగన్‌ తుగ్లక్‌ నిర్ణయాలు తీసుకున్నారని వాటన్నింటినీ రద్దు చేసుకున్నారు. గడప గడపకూ వెళ్లాలనేది ఏ రకంగా తుగ్లక్‌ నిర్ణయం..!ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!Full View

Tags:    

Similar News