Jagan-Governer Meet: జగన్‌ గవర్నర్‌ను ఎందుకు కలిశారు.. పిలిచారా.. కలిశారా..!

Jagan-Governer Meet: జగన్‌ గవర్నర్‌ను ఎందుకు కలిశారు.. పిలిచారా.. కలిశారా..!

By :  ehatv
Update: 2025-07-29 09:55 GMT

ఆంధ్రప్రదేష్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌తో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు బయటికి రాలేదు, మర్యాద పూర్వకంగానే వెళ్లి కలిసి వచ్చారు అనేది ప్రస్తుతానికి బయటికి వచ్చిన సమాచారం. ఆంధ్రప్రదేష్‌లో లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు, మరి కొంతమంది అరెస్టులు జరగబోతున్నాయి, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల అరెస్టులు కూడా జరుగుతూన్న నేపథ్యంలో నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టెస్టే ఉండొచ్చు అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తుంది. అధికార పార్టీ కూడా దానికి సంబంధించిన వార్తలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం అంటూ అధికార పార్టీలకు సంబంధించి, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండడం కూడా చూస్తున్నాం. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ డెఫినెట్‌గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి చర్చ బయట జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ పర్మిషన్ ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు లాంటి వార్తలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వెళ్లి గవర్నర్ తో సమావేశం కావడం అనేది తీవ్ర చర్చకు దారి తీస్తోంది. జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా అపాయింట్మెంట్ అడిగి వెళ్లి గవర్నర్‌ను కలిశారా, గవర్నర్ కలిస్తే ఏం మాట్లాడారు, ఇప్పటికే గవర్నర్‌ని అనేక సందర్భాల్లో వైసీపీకి సంబంధించిన ప్రతినిధులు వెళ్లి కలిశారు, ఆంధ్రప్రదేష్‌లో తమ పార్టీ నేతలపైన జరుగుతున్న దాడుల అంశానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో కూటమి సర్కారు చేస్తున్న అక్రమాల గురించి, ఇబ్బందుల గురించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లి కలిసింది కూడా కూటమి సర్కార్ పైన కంప్లైంట్ చేయడానికా అనేది తెలియదు.ఇదే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..Full View

Tags:    

Similar News