Commercial cylinder price Hike గ్యాస్ సిలిండర్‌పై రూ.111 పెంపు
Cylinder Price Hike: Rs. 111 hike on gas cylinder
By : ehatv
Update: 2026-01-02 08:03 GMT
కొత్త ఏడాది తొలిరోజే కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏకంగా రూ.111 పెంచేశాయి. గురువారం నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది. గత ఏడాది జూన్ తర్వాత ఇంత భారీస్థాయిలో వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఇదే మొదటిసారి. అయితే 14.2 కిలోల గృహోపయోగ వంటగ్యాస్ ధరలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. గడచిన రెండు నెలల కాలంలో రెండు సార్లు వాణిజ్య ఎల్‌పీజీ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి.