Tamanna Issue: కర్నాటకలో తమన్నా చిచ్చు..!
Tamanna Issue: కర్నాటకలో తమన్నా చిచ్చు..!
కర్నాటకలో తమన్నా భాటియా వివాదం మైసూర్ సాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను నియమించడం చుట్టూ తిరుగుతోంది. కర్నాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తమన్నాను రూ. 6.2 కోట్లతో రెండేళ్ల కాంట్రాక్ట్‌తో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది, ఈ నిర్ణయం రాష్ట్రంలో వివాదాన్ని రేకెత్తించింది. మైసూర్ సాండిల్ సోప్ అనేది 1916 నుంచి కర్నాటక సాంస్కృతిక వారసత్వంలో భాగమైన ఒక ఐకానిక్ బ్రాండ్. తమన్నా కన్నడేతర నటి ప్రధానంగా తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేస్తుంది.. దీంతో ప్రో-కన్నడ సంఘాలు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. కన్నడ నటీమణులైన రష్మికా మందన్నా, రుక్మిణి వసంత్, లేదా ఆశికా రంగనాథ్ వంటి వారిని ఎంచుకోవచ్చు కదా, అని ప్రశ్నిస్తున్నారు. ఈ బ్రాండ్ కర్నాటక గుర్తింపును సూచిస్తుంది కాబట్టి, స్థానిక నటిని ఎంచుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కర్నాటక ప్రభుత్వం , KSDL ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, తమన్నా భాటియా దాదాపు 28.2 మిలియన్ల సోషల్ మీడియా ఫాలోయర్స్‌తో పాన్ ఇండియా స్టార్ డం కలిగి ఉందని, ఇది బ్రాండ్‌ను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో విస్తరించడానికి సహాయపడుతుందని చెప్పారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎం.బీ. పాటిల్ ఈ నిర్ణయం మార్కెటింగ్ వ్యూహంలో భాగమని, బ్రాండ్‌ను కర్నాటక గడ్డ మీదుగా దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి తీసుకున్న చర్య అని వివరించారు. KSDL గతంలో ఎం.ఎస్. ధోనీ వంటి కన్నడేతర సెలెబ్రిటీలను కూడా ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, కన్నడ రక్షణ వేదిక (KRV) వంటి సంస్థలు ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కన్నడ సంస్కృతిని కాపాడాలని ఒత్తిడి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది, కొందరు తమన్నా ఎంపికను సమర్థించినా కొందరు వ్యతిరేకిస్తున్నారు.