HR మేనేజర్‌ను కంప్యూటర్ ఆపరేటర్ పటాయించాడు.. రెండేళ్ల ప్రేమ.. ఆమె తల నరికి మరీ..!

HR మేనేజర్‌ను కంప్యూటర్ ఆపరేటర్ పటాయించాడు.. రెండేళ్ల ప్రేమ.. ఆమె తల నరికి మరీ..!

By :  ehatv
Update: 2026-01-28 08:50 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం జరిగింది. రెండేళ్లు ప్రేమించి గత ఆరు నెలలుగా మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉందని ఆమె మెడపై కత్తితో పొడిచి చంపాడు ఆమె ఆఫీసులోనే పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెధీ బగియా ప్రాంతానికి చెందిన మింకీ శర్మ అనే హెచ్ఆర్ మేనేజర్ ఈనెల 23న అఫీసుకు వెళ్లి తిరిగి రాలేదని రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 24న ఇతమదుల్లా పోలీస్ స్టేషన్ ఏరియాలోని జవహార్ బ్రిడ్జి దగ్గర అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించింది. బ్యాగులో తల లేని మొండెంతో పాటు కాళ్లు చేతులు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు షాకయ్యారు. ఈ ఘటనపై స్పెషల్ టీమ్ తో దర్యాప్తు ప్రారంభించినట్లు డీసీపీ సయీద్ అలీ అబ్బాస్ చెప్పారు. మిస్సింగ్ కేసు, సీసీటీవీ ఫూటేజ్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆఫీస్ బిల్డింగ్ నుంచి బ్యాగ్‌ను ఈడ్చుకురావడం.. బ్రిడ్జి వైపు బ్యాగుతో స్కూటీపై వెళ్లడం పోలీసులు గుర్తించారు.

తమది రెండేళ్ల ప్రేమ అని హంతకుడు వినయ్ సింగ్ విచారణలో చెప్పాడు. ఇద్దరం రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నామని.. కానీ ఆమె గత ఆరు నెలలుగా వేరొకరితో సన్నిహితంగా ఉండటంతోనే హత్య చేసినట్లు తెలిపాడు. మింకీ శర్మ ఆరు నెలలుగా మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఈ హత్య చేసినట్లు చెప్పాడు. ఈనెల 23న మింకీ శర్మ రాగానే ఆమెతో గొడవపడ్డాడు. మాటకు మాట పెరిగి సహనం కోల్పోయిన సింగ్.. తనతోపాటు తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడిచాడు. ఆ తర్వాత మెడను శరీరంతో వేరు చేశాడు. బాడీని ఒక బ్యాగులో కుక్కి ప్లాస్టర్ తో సీల్ చేశాడు. మరో కవర్ లో తలను ప్యాక్ చేసి కనబడకుండా ప్లాస్టర్ వేశాడు. పెళ్లి విషయంలో వచ్చిన గొడవతో సహనం కోల్పోయినట్లు చెప్పాడు. మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉండటంతోనే తనతో పెల్లికి ఒప్పుకోలేదని.. అందుకే చంపేసినట్లు తెలిపాడు. 

Tags:    

Similar News