H1B వీసా నిబంధనలు: ట్రంప్ నిర్ణయం, మోదీ ప్రతిస్పందన

H1B వీసా నిబంధనలు: ట్రంప్ నిర్ణయం, మోదీ ప్రతిస్పందన

By :  ehatv
Update: 2025-09-20 10:43 GMT

H1B వీసాల పైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల భారతదేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ చూస్తున్నాం. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమెరికాతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే చర్చ జరుగుతుంది. H1B వీసాలకు అప్లై చేయాలంటే ఇకపైన లక్ష డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. సో ప్రస్తుత అమెరికా కరెన్సీ ప్రకారం దాదాపు 86-87 లక్షల రూపాయలు అప్లికేషన్ చేస్తున్న సందర్భంగానే చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పాటు మిగతా ఖర్చులన్నీ కలిపి, దాదాపు కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, H1B వీసాకు అప్లై చేయాలంటే, వీసాకు అప్లై చేసిన తర్వాత, మళ్ళీ లాటరీ పద్ధతిలో వీసాలు అలాట్ అవుతాయి. ఆ H1B వీసాకు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళు ఏమో ఎంఎన్సి కంపెనీలు ఇక్కడ నుంచి తమ ఉద్యోగుల్ని అమెరికాకి తీసుకువెళ్తున్న సందర్భంలోనూ, H1B వీసాల పైన అక్కడికి తీసుకెళ్తూ ఉంటాయి. సో H1B వీసాల అంశానికి సంబంధించి లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలి అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడ భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ప్రముఖులకు మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న ఎంఎన్సి కంపెనీలు కూడా తెలియకుండా జరిగింది అని చెప్తున్నారు. అనేక కంపెనీలు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఇతర దేశాలకు సంబంధించిన ఉద్యోగులని అక్కడే పిలిపించి పని చేస్తూ ఉంటాయి. సో కొంతమంది ఇక్కడికి వచ్చి పని చేస్తూఉంటారు, సో వాళ్ళందరికీ సంబంధించిన ఫీజ్ ని, ఆయా కంపెనీలు భరించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంటుంది, సో ఆ భరించడం అనేది ఆ కంపెనీలకు కూడా బర్డెన్ గా మారే పరిస్థితి ఉంటుంది. వాళ్ళతో చర్చించిన తర్వాత టాప్ 10 ఎంఎన్సి కంపెనీలతో చర్చించిన తర్వాతే. నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్తున్నప్పటికీ, ఈ నిర్ణయం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మెటా లాంటి కంపెనీస్, ఆ అలాగేమైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఇమ్మీడియట్ గా మీరు బయట దేశాల్లో ఉన్న H1B హోల్డర్స్ అంతా ఎవరైతే మన కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా ఇమీడియట్ గా అమెరికాకి వచ్చేయండి అంటూ వాళ్ళకి ఇంటర్నల్ గా ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైం అమెరికాలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బయటికి వెళ్ళే ఆలోచనలు ఉంటే, ఇమ్మీడియట్ గా వాటిని వాయిదా వేసుకోండి అంటూ కూడా చెప్పడం చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే ఆ టాప్ ఎంఎన్సి కంపెనీలు కూడా తెలియకుండానే ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. H1B వీసాలు-వివాదలపై జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Full View

Tags:    

Similar News