NCP MP Supriya: EVM ట్యాంపరింగే లేదు.. సుప్రియాసూలే సంచలన కామెంట్స్..!
NCP MP Supriya: There is no EVM tampering... Supriya Sule makes sensational comments!
By : ehatv
Update: 2025-12-16 06:28 GMT
దేశవ్యాప్తంగా ఈవీఎం ట్యాంపరింగ్, ఓట్ చోరీ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ఎంపీ సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటితోనే తాను 4 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని, అందుకే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు ఈవీఎంలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.