Kavitha vs Madhavaram: ఐడీపీఎల్‌ ల్యాండ్స్‌పై విచారణకు సర్కార్ రెడీ..!

Kavitha vs Madhavaram: The government is ready for an inquiry into the IDPL lands!

By :  ehatv
Update: 2025-12-16 06:37 GMT

IDPL ల్యాండ్స్‌పై విచారణకు కాంగ్రెస్‌ సర్కార్‌ ఆదేశించింది. రూ.4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్‌ విచారణ జరగనుంది.

భూకబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో కూకట్‌పల్లి సర్వేనంబర్‌ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడిపై కవిత ఆరోపణలు చేశారు. ప్రతిగా కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే మాధవరం. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించడం సంచలనంగా మారింది. కవిత, మాధవరం కృష్ణారావుపై ఆరోపణలు చేసిన వెంటనే విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, అదే మాధవరం కృష్ణారావు కవిత భర్తపై ఆరోపణలు చేస్తే ఎందుకు విచారణకు ఆదేశించలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి డైరెక్షన్‌లో కవిత ఉన్నారో చెప్పకనే చెప్తున్నారని కవితను టార్గెట్‌ చేశారు బీఆర్‌ఎస్‌ నాయకులు.

Tags:    

Similar News