Transgender: భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం
Transgender: భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం
భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం చేస్తుండడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భార్య. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌కు చెందిన బింగి రాజశేఖర్‌కు, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన లాస్య అనే మహిళతో 2014లో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉండగా, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ దీప్‌తో సన్నిహిత సంబంధాన్ని రాజశేఖర్ ఏర్పర్చుకున్నాడు. దీంతో రెండు రోజుల క్రితం తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి భార్య లాస్య పాల్పడింది. భార్యను చూసేందుకు రాజశేఖర్ కనీసం ఆసుపత్రికి కూడా రాకపోవడంతో, అతని కోసం లాస్య కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. భీష్మనగర్‌లో ట్రాన్స్‌జెండర్ దీప్‌తో ఉన్నాడని తెలిసి వారిద్దరిని గదిలో బంధించి పోలీసులకు లాస్య తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని వారిద్దరిని పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు