Mrunal Thakur : మృణాల్‌ ఠాకూర్‌ గార్జియస్ లుక్స్‌తో మతేక్కిస్తోంది
నటి మృణాల్‌ ఠాకూర్‌ ఇటీవల కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రాన్ని తన తండ్రితో కలిసి వీక్షించారు.
ఈ అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ, కంగనా నటనపై ప్రశంసలు కురిపించారు.
'గ్యాంగ్‌స్టర్‌' నుండి 'క్వీన్‌', 'తను వెడ్స్ మను' నుండి 'మణికర్ణిక', 'తలైవి' వరకు కంగనా తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించారని, ఇప్పుడు 'ఎమర్జెన్సీ'తో మరో మైలురాయిని చేరుకున్నారని మృణాల్‌ పేర్కొన్నారు.
సినిమాలోని ప్రతి అంశం, కెమెరా యాంగిల్స్‌, కాస్ట్యూమ్స్‌, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్‌ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. కంగనా కేవలం నటి మాత్రమే కాకుండా, సవాలుతో కూడిన పాత్రలు పోషించే ధైర్యం ఉన్న నిజమైన కళాకారిణి అని ఆమె కొనియాడారు. ఈ చిత్రాన్ని ప్రతి భారతీయుడు తప్పనిసరిగా చూడాలని మృణాల్‌ సూచించారు.
ఇదిలా ఉండగా, మృణాల్‌ ఠాకూర్‌ తన కెరీర్‌లో పాత్రలను జాగ్రత్తగా ఎంపిక చేస్తూ, ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండే ప్రాజెక్టులను మాత్రమే స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
తనకు వచ్చిన ప్రతి ఆఫర్‌ను అంగీకరించకుండా, తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారని, అందుకే ఇటీవల కొన్ని ప్రాజెక్టులను తిరస్కరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు లేవని సమాచారం.
మరోవైపు, 'సీతారామం' చిత్రంలో సీత పాత్రలో నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం విజయంతో ఆమె క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగింది.