AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విశాఖపట్నం లో ఏర్పాటు చేయనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు 529 కోట్ల రూపాయల విలువైన 21.16 ఎకరాల ప్రభుత్వ భూమినీ కేవలం 99 పైసలకు అమ్మాలన్న ప్రభుత్వం నిర్ణయం పై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు కావడంతో భూమిని అమ్మాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. రూ.529 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 99 పైసలకు అమ్మాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సవాలు చేసిన సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విశాఖపట్నం అధ్యక్షురాలు నక్క నమ్మి గ్రేస్ , జీవో నెంబర్ 7 ద్వారా వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని టీసీఎస్‌కు ఇవ్వటాన్ని తప్పు పట్టిన పిటిషనర్, ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈరోజు విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, రవి చీమలపాటి ధర్మాసనం. రూ.529 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 99 పైసలకు అమ్మటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని వాదనలు వినిపించిన న్యాయవాది
జడ శ్రవణ్ కుమార్. ఏపీఐఐసీ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ రెగ్యులేషన్ నెంబర్ 11.3 ద్వారా కేవలం లీజుకు మాత్రమే అవకాశం ఉన్న చట్టాన్ని అధికమించి ఒక్క ఇటుక రాయి కూడా వేయని కంపెనీకి సేల్ డీడ్ చేయటం చట్ట వ్యతిరేకం అన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్
రేపు టీసీఎస్ కంపెనీ ఒక రూపాయి పెట్టుబడి పెట్టకపోయినా, ఒక ఉద్యోగం కల్పించక పోయినా, ఒక్కసారి సేల్ డీడ్ ద్వారా ల్యాండ్ బదలాయించిన తర్వాత తిరిగి తీసుకునే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుందన్న పిటిషనర్. కేవలం రాజకీయ ప్రయోజనాలతోనే ఈ ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది అంటూ వాదనలు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ప్రణతి. టిసిఎస్ కంపెనీకి తమ ప్రభుత్వ భూమిని అమ్మాలన్న ప్రతిపాదన లేదని ఇది కేవలం నామమాత్రపు లీస్ మాత్రమే అంటూ స్పష్టం. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో లీస్ అని ఎక్కడ పేర్కొనకపోవడం పలు అనుమానాలకి తావిస్తుందన్న ధర్మాసనం. జీవో తప్పులు తడకగా ఉందన్న ధర్మాసనం. భూమిని అమ్మడం లేదని కేవలం లీజ్ మాత్రమే అంటూ ప్రభుత్వం ప్రకటించిన కారణంగా తము ఆదేశాలు ఇవ్వటం లేదని పేర్కొన్న ధర్మాసనం. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూ బదలాయింపులో తీసుకునే ఏ చర్యలు ఐనా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటుందని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్న ధర్మాసనం. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.