AP Media: బాధ్యత లేని ఏపీ మీడియా?

AP Media: బాధ్యత లేని ఏపీ మీడియా?

By :  ehatv
Update: 2025-09-11 11:31 GMT

మీడియా ప్రజల పక్షాన ఉండాలి, మీడియా ప్రజలకు నష్టం జరుగుతుంటే కనీసం మాట్లాడాలి, మీడియా ప్రజలు దోపిడికి గురవుతుంటే కనీసం ప్రశ్నించాలి, మీడియా ప్రజల భవిష్యత్తుని, ప్రభుత్వాలు తాకట్టు పెడుతుంటే ప్రశ్నించాలి, వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మీడియాకు అవేవి కనపడట్లేదు, ఆంధ్రప్రదేశ్ మీడియాకు, కొంతమంది మీడియా సంస్థలకు, కొన్ని మీడియాలకు, ఓ పార్టీ కనపడుతుంది, మరికొన్ని మీడియాలకు మరో పార్టీ కనపడుతుంది. ప్రజలు కనిపించట్లే, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో, మెడికల్ కాలేజీల్ని పిపిపి మోడల్‌లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేకపోతుంది. మీడియా ప్రశ్నించలేకపోతుంది, మీడియా సామాజిక బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఒక సమస్యను పరిష్కారం చేసిన పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్ గురించి నిత్యం వార్తలు రాస్తున్న ఏ మీడియా కూడా మూడు, నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోషిస్తున్న మీడియా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఒక్క సమస్యని బాధ్యతగా తీసుకొని పరిష్కారం చేసింది లేదు, పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో నాణ్యమైన వైద్యం దొరక్కుండా చేసే కుట్ర చేస్తుంటే, కనీసం ప్రశ్నించలేకపోతుంది, తలకాయలో బుర్ర ఉన్నవాడికి ఎవడైనా, బుర్రలో కాస్త కామన్ సెన్స్ ఉన్నవాడికి ఎవడికైనా అర్థమవుతుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రజలకు సేవ ఎలా చేస్తుంది, ప్రభుత్వం నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలు , ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలు తీసుకుంటే, డబ్బులు వసూలు చేస్తారు కదా, పేదల్ని పీడిస్తారు కదా, క్వాలిటీ వైద్యం ఎక్కడ దొరుకుతుంది అని కానీ, ఆంధ్రప్రదేశ్ లో మీడియాకు అర్థం కావట్లేదు.

కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలు సాధించింది గత ప్రభుత్వం, గత ప్రభుత్వం వాటిని ఇన్ టైం లో పూర్తి చేయలేకపోయింది, పూర్తి చేయలేకపోవడానికి గత ప్రభుత్వం రకరకాల కారణాలు చెప్తోంది, కొన్ని కాలేజీలు పూర్తి చేసింది, కొన్నిటికి ల్యాండ్ ఇచ్చింది, కొన్నిటికి పునాదులు వేశారు, కొన్నిటికి పిల్లర్లు లేపారు, అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని, వాటిని పూర్తి చేయడం కదా, గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది, కాబట్టి మేము కూడా పూర్తి చేయలేమని పక్కన పెడుతుంటే, మీడియా ఎందుకు ప్రశ్నించలేకపోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్న పరిస్థితిలో ఒక నాలుగుఐదు వేల కోట్ల రూపాయలు, 17 మెడికల్ కాలేజీల కోసం వెచ్చించలేని పరిస్థితిలో ఉందా, ఈ మాట ఎందుకు మీడియా అడగలేకపోతుంది, ఆంధ్రప్రదేశ్లో మీడియా సంస్థలు ఇస్తున్న వార్తలు చూసినప్పుడు, అక్కడ మెడికల్ కాలేజీలు ఏంటో, మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ ఏంటో, అది అది తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొడవలాగా చూపిస్తున్నాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటో చెప్పలేకపోతున్నాయి. ఇంకా కొన్ని మీడియా సంస్థలు అయితే చాలా సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ప్రైవేట్ పరం చేయడం అద్భుతం అంటూ పుంకానుపుకాలుగా వార్తలు రాసేస్తున్నాయి. ఆత్మవంచన చేసుకుంటున్నాయి, తెలుగు జాతికి ద్రోహం చేస్తున్నాయి, తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి, మూడు, నాలుగు దశాబ్దాలుగా మిమ్మల్ని పోషిస్తున్న మీ వార్తలు చదువుతూ, మిమ్మల్ని గౌరవిస్తున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి. ఏమాత్రం బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా వైఖరిపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Full View

Tags:    

Similar News