Wife Cheating: నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా.. భర్తకు భార్య వార్నింగ్..!

Wife Cheating: నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా.. భర్తకు భార్య వార్నింగ్..!

By :  ehatv
Update: 2025-06-25 10:32 GMT

శోభనం రోజు గదిలోకి కత్తి తీసుకెళ్లి భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య. కేదార్‌నాథ్ యాత్రకు తీసుకు వెళ్ళమని అడిగిన యువతి.. రాజరఘువంశి ఘటన గుర్తొచ్చి ఆగిపోయిన భర్త. కొద్దిరోజులకు వరుసకు మేనల్లుడైన యువకుడితో మహిళ లేచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి, సితార అనే యువతితో ఇటీవల వివాహం జరగగా, మొదటి రాత్రి రోజు తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పిన యువతి. తన భార్య సితార, వరసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని పేర్కొన్న భర్త. తన ప్రేమికుడు అమన్ మెసేజ్ చేసి స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరించాడని తెలిపిన నిషాద్. సితార తనను కేదార్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, ఇటీవల జరిగిన రాజారఘువంశి హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని చెప్పిన నిషాద్. మూడు రోజులు తన ఇంట్లో ఉండి, ఒకరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో పారిపోయిందని తెలిపిన నిషాద్. మూడు రోజులు తనతో ఉన్నప్పుడు ఎక్కడ చంపేస్తుందో అని నిద్ర కూడా పోలేదని, పెళ్లి అనే మాట వింటేనే గుండెల్లో దడ పుడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన నిషాద్

Tags:    

Similar News