Lady Illegal Affair: వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్న అత్తను తొలగించేందుకు కోడలు మాస్టర్ ప్లాన్..!

Lady's Illegal Affair: Extramarital affair... The daughter-in-law devises a master plan to eliminate her mother-in-law who was standing in her way!

By :  ehatv
Update: 2025-12-16 06:48 GMT

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని అత్తను ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు ప్రయత్నించింది ఓ ఆదర్శవంతమైన కోడలు. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. అత్త చనిపోయిందని భావించి ప్రియుడితో కలిసి మూడేళ్ల బాలుడితో మహిళ పరారైంది. అయితే కొన ఊపిరితో ప్రాణాలు దక్కించుకున్న వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన నలపాల సురేష్‌- లిఖిత భార్యాభర్తలు, వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. సురేష్‌ తల్లి పార్వతి కొడుకు వద్దే ఉంటుంది. సురేష్‌ నగరంలోని ఓ పెట్రోల్‌బంకులో పనిచేస్తుంటాడు. సురేష్‌ ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. ఈ క్రమంలో అందరూ నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి సురేష్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న పార్వతిపై దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక పార్వతి బిగ్గరగా కేకలు పెడుతూ ఇంట్లో ఉన్న లిఖితను పిలిచింది. లిఖిత ఎంతకీ బయటకు రాలేదు. ఆమెను చంపేందుకు రకరకాలు ప్రయత్నిస్తుండగా పార్వతి అతని దాడిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నట్లు నటించిన లిఖిత కారం తెచ్చి ఆ వ్యక్తి చేతికి ఇవ్వటంతో అత్త కళ్లల్లోకి విసిరాడు. అనంతరం ఇద్దరు ఆమెను అంతమొందించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

చివరికి పార్వతి అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన లిఖిత ఆ వ్యక్తితో కలిసి తన మూడేళ్ల బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. గాయాలపాలైన పార్వతి సమీపంలో బంధువుల ఇంటికి విషయం చెప్పగా వారు సురేష్‌కు జరిగిన విషయం చెప్పారు. దీంతో సోమవారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రియుడు, ప్రియురాలి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News