Very Painfull Incident: శంషాబాద్‌లో తీవ్ర విషాదం.. కడుపులో కవలలు మృతి.. ! భార్య మరణం తట్టుకోలేక భర్త సూసైడ్..!
Very Painfull Incident in Shamshabad.. Twins die in the womb..! Unable to bear the death of his wife, the husband commits suicide..!
8 నెలల గర్భిణీ మహిళ కడుపులో కవల పిల్లలు మృతి, చికిత్స పొందుతూ మహిళ మృతి. భార్య పిల్లల మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తూ భార్యతో కలిసి సమీపంలోని సామ ఎన్‌క్లేవ్లో నివాసం ఉంటున్న కడప జిల్లాకు చెందిన విజయ్–శ్రావ్య దంపతులు. పెళ్లి అయ్యి ఏడాది గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో, ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్న దంపతులు. 8 నెలల గర్భిణిగా ఉన్న శ్రావ్యకు ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో, తన తల్లితో కలిసి అత్తాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, కడుపులో ఉన్న కవల పిల్లలు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రావ్యకు కూడా మెరుగైన చికిత్స చేయించాలని వైద్యులు సూచించడంతో, గుడిమల్కాపూర్ ప్రాంతంలోని మైత్రి అనే ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన కాసేపటికి తన భార్య చనిపోవడంతో, తీవ్ర ఆవేదనకు గురయ్యి ఇంటికి తిరిగి వెళ్లిన విజయ్ కుమార్. మరుసటి రోజు శ్రావ్య మృతదేహాన్ని తీసుకెళ్లాలని, అందుకు సంతకం కావాలని విజయ్ కు ఫోన్ చేసిన ఆసుపత్రి సిబ్బంది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూడగా, ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించిన విజయ్ కుమార్